Former MP Subba Reddy to take over as chairman of TTD trust on Saturday 22nd June 2019
తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

తితిదే ఛైర్మన్‌గా సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం


తిరుమల: తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో జరిగిన కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. వైవీ సుబ్బారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సినీ నిర్మాత దిల్‌రాజు, పాలక మండలి మాజీ సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. త్వరలో కొత్త బోర్డు సభ్యుల నియామకం చేపట్టనుంది. కాగా నూతన చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి శనివారం 22 జూన్ 2019 11 గంటలకు గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఈనాడు: తితిదే ఛైర్మన్ నియామకంపై ఉత్తర్వులు జారీ
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలి కొత్త ఛైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం తితిదేకు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ పేర్కొంది. త్వరలో పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, పాత పాలకమండలిని సైతం రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాలక మండలి సభ్యులుగా సుధా నారాయణమూర్తి, సుగవాసి ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, ఇ.పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథం తదితరుల రాజీనామాలను సైతం ప్రభుత్వం ఆమోదించింది.


