ఓం శ్రీ పద్మావతిదేవియే నమ:


శ్రీపద్మావతి శ్రీనివాసుల దివ్యకల్యాణ వైభవం
– శేషాచలంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామివారి హృదయపట్టపు దేవేరి శ్రీ అలమేలుమంగమ్మ. శ్రీనివాసుని వక్ష:స్థలంలో ”వ్యూహలక్ష్మి” గాను, తిరుచానూరు క్షేత్రంలో ”పద్మావతి మరియు అలమేలు మంగ” అన్న పేర్లతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
– పూర్వపు రోజుల్లో శ్రీ శుక మహర్షి పావన ఆశ్రమంగా వెలుగొందిన ఊరు తిరుచానూరు. దీనిని తిరుశుకనూరు అని కూడా పిలుస్తారు.
– తిరుచానూరులోని పద్మసరోవరం అనే పుష్కరిణిలో శ్రీనివాసుని ప్రార్థన మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి బంగారు సహస్రదళ పద్మంలో ”పద్మావతి”గా అవతరించిందని పద్మపురాణం ద్వారా తెలుస్తోంది.
– ప్రతిరోజూ రాత్రి ఏకాంతసేవ తరువాత తిరుమల శ్రీనివాసుడు తిరుచానూరులోని శ్రీ పద్మావతి వద్దకు వస్తాడనీ, ఆ దివ్య దంపతులు భక్తుల గురించి ముచ్చటించుకుంటారనీ నేటికీ వినపడుతున్న జనశ్రుతి.
– తిరుమల శ్రీవారిని ఒక రోజుకు సరాసరి 75 వేల మంది భక్తులు దర్శించుకుంటుండగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సరాసరి రోజుకు 30 వేల మంది దర్శించుకుంటున్నారు.
– ఇలాంటి దివ్యక్షేత్ర మహిమను, శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్యకల్యాణ వైభవాన్ని భక్తులు వీక్షించి మధురానుభూతిని పొందేలా తిరుమల తిరుపతి దేవస్థానములు చేసిన మహత్తరమైన ప్రయత్నం ఇది.
– 15 నిమిషాల వ్యవధిలో అమ్మవారి పరిణయ ఘట్టాన్ని కళ్లకు కట్టేలా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో 32 ఫ్రేములను టిటిడి ఏర్పాటు చేసింది.
– ఆగుమెంటెడ్ రియాలిటి టెక్నాలజి సాయంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్రేములను భక్తులు సెల్‌ఫోన్ ద్వారా స్కాన్ చేసినట్లయితే అక్కడున్న చిత్రాలు నేరుగా మాట్లాడిన భావన కలుగుతుంది.
– ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు డా.. ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం తమ మధురమైన కంఠంతో ఈ ఘట్టం వృత్తాంతాన్ని తెలియజేశారు.
– సందర్భానుసారం ఆకాశరాజు, శ్రీనివాసుడు, శ్రీ పద్మావతి, శ్రీ శుక మహర్షి, కుబేరుని చిత్రాలు ఆయా పాత్రల ఔచిత్యాన్ని తెలియజేస్తాయి.
– ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి జననం, నామకరణం, బాల్యం, పరిణయం తదితర ఘట్టాలు ఉన్నాయి.
సెల్‌ఫోన్ ద్వారా మధురానుభూతిని పొందడమెలా ?
– స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా పద్మావతి పరిణయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
– క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
– చిత్రపటం ముందు 6 అడుగుల దూరంలో నిలబడి యాప్ ద్వారా ఫ్రేమ్‌లను స్కాన్ చేసి సన్నివేశాన్ని వీక్షించవచ్చు.
– యాప్‌ను ఉపయోగించేటపుడు హెడ్‌ఫోన్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
– తిరుచానూరుకు విచ్చేస్తున్న భక్తులందరూ పద్మావతి పరిణయ ఘట్టాన్ని వీక్షించి పద్మావతి శ్రీనివాసుల కృపకు పాత్రులు కాగలరని తిరుమల తిరుపతి దేవస్థానములు కోరుతోంది.
