తిరుపతి: ఆదివారం, 2019 ఏప్రిల్ 07
శ్రీ కోదండరామస్వామివారికి తిరుమల శ్రీవారి సాలిగ్రామ హారము బహుకరణ


తిరుపతి, 2019 ఏప్రిల్ 07
శ్రీ కోదండరామస్వామివారికి తిరుమల శ్రీవారి సాలిగ్రామ హారము బహుకరణ
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారికి తిరుమల శ్రీవారి సాలిగ్రామ హారము, 2 పేటల చంద్రహారము, సాదారణ రాళ్లు పొదగబడిన బంగారు కర్ణాలు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అందించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవను పురస్కరించుకుని ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించనున్నారు.
ముందుగా శ్రీవారి సాలిగ్రామ హారము, చంద్రహారము, సాదారణ రాళ్లు పొదగబడిన బంగారు కర్ణాలను తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు.
ఆనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం కలిసి ఊరేగింపుగా ఆభరణాలను మంగళవాయిధ్యాల నడుమ శ్రీకోదండరామలయానికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామివారికి అలంకరించారు.
అంతకుముందు పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం, ఆలయ పేష్కార్ శ్రీ రమేష్‌బాబు, ఒఎస్‌డి శ్రీపాల శేషాద్రి, ఫార్ ఫతేరార్ గురురాజస్వామి, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని శ్రీఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు తీసుకొచ్చి తిరుపతి జెఈవోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వేలాది మంది భక్తులు ఉదయం, రాత్రి స్వామివారి వాహనసేవలలో పాల్గొంటున్నట్లు తెలియజేశారు.
భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు వివరించారు.
స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి బంగారు ఆభరణాలు అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఇందులో భాగంగా గరుడ సేవ నాడు శ్రీ కోదండరామస్వామివారికి 655 గ్రాముల సాలిగ్రామ హారము, 332 గ్రాముల 2 పేటల చంద్రహారము, 374 గ్రాముల సాదారణ రాళ్లు పొదగబడిన బంగారు కర్ణాలు అలంకరించనున్నాట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీశ్రీధర్, ఏఈవో శ్రీ తిరుమలయ్య ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

