28-03-2019-NewsClips

28-03-2019-NewsClips
10TPT-05.qxd

ఏప్రిల్‌లో ఆయుర్వేద కళాశాలకు ఐఏస్‌వో గుర్తింపు

Review Meeting 27-03-2019.jpg
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జేఈవో లక్ష్మీకాంతం

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: తితిదే ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, కళాశాలకు ఏప్రిల్‌లో నెలలో ఐఎస్‌వో గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తితిదే తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బుధవారం వసతి కల్పన విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తితిదే వసతి సముదాయాల్లో బస చేసే భక్తులకు రక్షణ కల్పించేందుకు తగినంత మంది భద్రతా సిబ్బందిని నియమించామని, భక్తుల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విష్ణునివాసంలో తరహాలో శ్రీనివాసం, మాధవంతో పాటు తితిదే విద్యాసంస్థలు, కల్యాణమండపాలకు ఐఎస్‌వో గుర్తింపు కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వసతి సముదాయాల్లోని గదుల్లో నీరు, విద్యుత్‌ తదితర సమస్యలు లేకుండా, తితిదే నిర్దేశించిన ప్రమాణాల మేరకు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వసతి సముదాయాల్లో శ్రీవారు, పద్మావతి అమ్మవారి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని, వేసవి నేపథ్యంలో తితిదేలోని అన్ని సంస్థల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని, విద్యుత్‌ కొరత లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ1 రమేష్‌రెడ్డి, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లక్ష్మీనరసమ్మ, రిసెప్షన్‌ ప్రత్యేకాధికారి మునిరత్నంరెడ్డి, ఏఈవో గీత, డీఈ రవిశంకర్‌రెడ్డి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బి.సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Annamayya Keertanalu Recording Eenadu 28-03-2019Annamayya Keertanalu Recording Prabha 28-03-2019Annamayya Keertanalu Recording Sakshi 28-03-2019Facilities at Rest Houses Jyothy 28-03-2019Facilities at Rest Houses Prabha 28-03-2019Facilities at Rest Houses Vartha 28-03-2019ISO to Ayurveda College in April Eenadu 28-03-2019ISO to Ayurveda College in April Vartha 28-03-2019Summer Safe guard in Rest Houses Sakshi 28-03-2019VedanarayanaSwamy Temple Bhoomi 28-03-2019VedanarayanaSwamy Temple Jyothy 28-03-2019VedanarayanaSwamy Temple Prabha 28-03-2019VedanarayanaSwamy Temple Sakshi 28-03-2019VedanarayanaSwamy Temple Vartha 28-03-2019

Leave a comment