26-March-2019-NewsClips

26-March-2019-NewsClips

తిరుప‌తి ప‌ర‌కామ‌ణిలో జెఈవో ల‌క్ష్మీకాంతం త‌నిఖీలు

This slideshow requires JavaScript.

తిరుప‌తి జెఈవో ల‌క్ష్మీకాంతం కామెంట్స్ :

భ‌క్తులు హుండీలో స‌మ‌ర్పించిన నాణేల‌ను త్వ‌రిత‌గ‌తిన మార్పిడి చేసేందుకు ఆంధ్రా బ్యాంకు అధికారుల‌తో చ‌ర్చిస్తాము…

నూత‌న భ‌వ‌నంలో ప‌ర‌కామ‌ణి హాళ్ల‌లో గాలి వెళుతురు బాగా ఉండేలా త‌గిన ఏర్పాట్లు చేస్తాము..

ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని ఖాళీ చేసి ఉద్యోగుల సంక్షేమ హాలుగా మార్చాల‌ని అధికారుల‌కు సూచన.


Parakamani Bhoomi 26-03-2019Parakamani Eenadu 26-03-2019Parakamani Jyothy 26-03-2019Parakamani Prajasakti 26-03-2019Parakamani Sakshi 26-03-2019Parakamani Vaartha 26-03-2019

SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Prabha 26-03-2019.jpg
Chandragiri Kodanda Swamy Prabha 26-03-2019Chandragiri Kodanda Swamy Prajasakti 26-03-2019
SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Bhoomi 26-03-2019SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Jyothy 26-03-2019SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Prabha 26-03-2019SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Prajasakti 26-03-2019SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Vartha 26-03-2019
Saptagiri Magazine Vartha 26-03-2019
SriKalyana Venkateswara Swamy SrinivasaMangaPuram Visalandhra 26-03-2019


img-20190325-wa0071-1892673825.jpg
మార్చి 25, తిరుపతి, 2019
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో

మార్చి 31వ తేదీన జరుగనున్న వార్షిక పుష్పయాగం గోడపత్రికలను

టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ఆవిష్కరించారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో సోమ‌వారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయంలో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని, ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వివ‌రించారు. మార్చి 30వ తేదీ శ‌నివారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అంకురార్పణ జరుగనుంద‌న్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. మధ్యాహ్నం 2 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జ‌రుగ‌నుంద‌ని, ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారని తెలియ‌జేశారు. భ‌క్తులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో పాల్గొనాల‌ని జెఈవో కోరారు.

కాగా, రూ.516/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పుష్పయాగంలో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల‌కు రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. పుష్పయాగం కారణంగా మార్చి 31వ తేదీన ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, ఏఈవో శ్రీ డి.ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ బి.అనిల్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

———————————————  టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


This slideshow requires JavaScript.

ఏప్రిల్ 14 నుంచి చంద్రగిరి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో బి. లక్ష్మీకాంతం
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి: జేఈవో

చిత్తూరు: వచ్చేనెల 14 నుంచి 24 వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో లక్ష్మీకాంతం స్పష్టం చేశారు. ఈ మేరకు జేఈవో లక్ష్మీకాంతం .. చంద్రగిరిలోని రామాలయాన్ని సందర్శించి.. ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల పట్ల ఆలయ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని, భక్తుల పట్ల ఎవ్వరూ అసహనం వ్యక్తం చేయకూడదని జేఈవో పేర్కొన్నారు. అనంతరం జేఈవోకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సత్కరించారు.


 

 

Leave a comment