Felicitation-in-Krishna-District-NewsClips-24-February-2019

మార్గదర్శకులు లక్ష్మీకాంతం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణరావు

గొడుగుపేట, న్యూస్‌టుడే: లక్ష్మీకాంతం లక్షణాలు అందరికీ ఆదర్శనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మచిలీపట్నం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవాలయ జేఈవో లక్ష్మీకాంతంను ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం చెరగని ముద్ర వేశారని, అయన అధికారులందరికీ మార్గదర్శకులని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం నుంచి సమస్యలపై తక్షణం స్పందించడంలో ఆయనకు ఆయనే సాటి అని ప్రశంసించారు. లోక్‌అదాలత్‌లో భాగంగా వృద్ధుల కోసం గుడివాడలో నిర్వహించిన సమావేశం జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే లక్ష్మీకాంతం కారణమన్నారు. జిల్లా జడ్జిగా తాను, జిల్లా కలెక్టర్‌గా లక్ష్మీకాంతం, ఎస్పీగా సర్వశ్రేష్ఠత్రిపాఠి జిల్లా ప్రజలకు ఆయా విభాగాల ద్వారా సుపరిపాలన అందించగలిగినట్లు భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం తిరుపతి వెంకన్న సేవలో ఉండటం ఆయన అదృష్టమన్నారు. జిల్లా ఎస్పీతోపాటు పలువురు ప్రసంగించారు. లక్ష్మీకాంతం మాట్లాడుతూ అందరి సహకారంతో తాను దిగ్విజయంగా బాధ్యతలు నిర్వహించానని అన్నారు. విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ కన్వీనర్ అంబటి శేషుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ సాయికృష్ణ, రూరల్ సీఐ రవికుమార్, ఎక్సైజ్ సీఐ వైకుంఠరావు తదితరులు ప్రసంగించారు. నంగెగడ్డ బాబు, మన్నెం సోమేశ్వరరావు, బీడి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
భాస్కరపురం,న్యూస్‌టుడే: కలెక్టర్‌గా జిల్లా ప్రజలకు అత్యుత్తమ సేవలందించి, జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపి తితిదే జేఈవోగా బాధ్యతలు స్వీకరించిన బి.లక్ష్మీకాంతం సేవలు స్ఫూర్తిదాయకం అని మున్సిపల్ ఛైర్మన్ బాబాప్రసాద్ పేర్కొన్నారు. శనివారం లక్ష్మీకాంతం దంపతులు పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పలువురు ప్రముఖులు పౌరసన్మానం ఏర్పాటు చేశారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ మాట్లాడుతూ జిల్లా ప్రగతిలో కలెక్టర్‌గా తనదైన ముద్ర వేసిన లక్ష్మీకాంతం తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా ప్రజలకు చేరువచేయడంలో అధికారులదే కీలక పాత్ర అని, అధికార యంత్రాంగాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి వారందరిచేత ప్రజలకు సుపరిపాలన అందించారని కొనియాడారు. వీవీఎస్ గ్రూపు సంస్థల అధినేత వేమూరి రమేష్‌బాబు మాట్లాడుతూ లక్ష్మీకాంతం మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. లయన్ల్ క్లబ్ ప్రతినిధులు పంచపర్వాల సత్యనారాయణ, పి.ప్రభాకర్, న్యాయవాది పుప్పాల ప్రసాద్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంపుగడల చౌదరి, వేమూరి ఈశ్వర్‌సుహాస్, బచ్చుల అనిల్‌కుమార్, తెదేపా నాయకులు పి.మురళీధర్, ఎ.రత్నాకర్, ఎస్.రాజేంద్రప్రసాద్, హసీంబేగ్ తదితరులు లక్ష్మీకాంతం సేవలను కొనియాడారు. అనంతరం లక్ష్మీకాంతం దంపతులను ఘనంగా సత్కరించారు.
ఉల్లిపాలెం గ్రామం లో

























