ABC-Aluri-Butchaiah-Chowdary-Statue-Unveiled-15-Sep-2018

15-సెప్టెంబర్-2018 శనివారం ఉదయం విజయవాడ పటమట ఏబీసీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆలూరి బుచ్చయ్య చౌదరి విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని తొలుత ఆలూరి బుచ్చయ్య చౌదరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), నగర మేయర్ కోనేరు శ్రీధర్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్-2 పి.బాబురావు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, నిర్మల, బుచ్చయ్య చౌదరి సతీమణి కమల, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.





