07-August-2018-NewsClips

07-August-2018-NewsClips



తాజావార్తలు

మూడు బస్సులు, కారు ఒకదానికొకటి ఢీకృష్ణా జిల్లాలో సినిమా సన్నివేశాన్ని తలపించిన రోడ్డుప్రమాదంబస్సు డ్రైవర్‌మృతి, 25మందికి గాయాలు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడరును ఢీకొట్టింది. అదే సమయంలో ఆ బస్సు వెనుక వస్తున్న మరో రెండు ప్రైవేటు బస్సులు, ఓ కారు ఒకదానికొకటి ఢీకొట్టాయి. మొత్తం మూడు బస్సులు, కారు వేగంగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా… సుమారు 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మంది విజయవాడ ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడిని రెండో బస్సు డ్రైవర్‌ విశాఖకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావుగా పోలిసులు గుర్తించారు.
క్షతగాత్రులకు కలెక్టర్‌ పరామర్శ
గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం స్పందించారు. విజయవాడ గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అందరి ఆరోగ్యం బాగానే ఉందని…, ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ లక్ష్మీ కాంతం పేర్కోన్నారు.

For scroll

మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద జరిగిన బస్ ప్రమాదం ఘటనతెలుసుకున్న వెంటనే స్పందించిన కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం

గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి పరిస్థితి సమీక్షిస్తున్న కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం

ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్ మృతి చెందారు. .. కలెక్టర్

మిగతా వారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.. బి. లక్ష్మీ కాంతం

పదకొండు మంది ఆంద్రా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం చేర్పించడం జరిగింది.. కలెక్టర్

విజయవాడలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చేరారు, వారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.. బి.లక్ష్మీ కాంతం

జగ్గయ్యపేట లో ముగ్గురు చికిత్స కు చేరగా ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.. కలెక్టర్

విజయవాడ, అమలాపురం, హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించడం జరిగింది..

హైదరాబాద్ కు ఇద్దరు వెల్లడం జరిగింది.. కలెక్టర్

కావేరి బస్ 22 మంది ప్రయాణికులతో అమలాపురం నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్.. కలెక్టర్


WhatsApp Image 2018-08-07 at 7.49.57 PMWhatsApp Image 2018-08-07 at 7.49.58 PMWhatsApp Image 2018-08-07 at 7.50.00 PMWhatsApp Image 2018-08-07 at 7.50.02 PMWhatsApp Image 2018-08-07 at 7.50.03 PMWhatsApp Image 2018-08-07 at 7.50.08 PMWhatsApp Image 2018-08-07 at 7.50.12 PM

Leave a comment